![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో సెలెబ్రిటీ కోటాలో సుమన్ శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతను ఫస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నప్పుడు అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో వారం కూడా మెజారిటీ ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. 1983 జూన్ 9న జన్మించారు. సినీ రచయిత సత్యానంద్ ఆయనలోని నటుడిని గుర్తించి, సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. అలా తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'జయం' సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయమయ్యారు సుమన్ శెట్టి. ఆ సినిమాలో 'అలీ బాబా'గా ఆయన పంచిన వినోదాన్ని అంత తేలికగా మరచిపోలేము. మొదటి సినిమాకే బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారో.. ఏ రేంజ్ లో నవ్వుల వర్షం కురిపించారో అర్థం చేసుకోవచ్చు. 'జయం' తర్వాత సుమన్ శెట్టి వెనుతిరిగి చూసుకోలేదు. స్టార్ కమెడియన్ గా దశాబ్దంపాటు ఆయన కెరీర్ దిగ్విజయంగా కొనసాగింది. కబడ్డీ కబడ్డీ, 7జి బృందావన్ కాలనీ, యజ్ఞం, ధైర్యం, రణం, ఉల్లాసంగా ఉత్సాహంగా, దొంగల బండి, బెండు అప్పారావు.. ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ దాదాపు 20 సినిమాల్లో నటించి మెప్పించారు.
సుమన్ శెట్టి గురించి డైరెక్టర్ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఒక సైట్ కొనుక్కోమని చెప్పాను.. అతను చెప్పినట్టే సుమన్ శెట్టి సైట్ కొన్నాడు. ఆ తర్వాత ఒకరోజు తేజ గారి దగ్గరికి వెళ్ళిన సుమన్ శెట్టి అతని కాళ్ళ మీద పడబోయాడంట.. అలా ఏం వద్దని డైరెక్టర్ తేజ అన్నాడంట. మరి నేను ఏ విధంగా మీ ఋణం తీసుకోగలనని డైరెక్టర్ తేజని సుమన్ శెట్టి అడుగగా.. నేను కొత్తవాళ్ళతో సినిమాలు తీస్తాను.. ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తాను.. అప్పుడు నాకు ఉండడానికి చోటు కావాలి కదా.. నువ్వు కట్టుకునే ఇంట్లో నా కోసం ఓ గదిని ఉంచమని చెప్పడంతో సుమన్ శెట్టి అలాగే చేశాడంట.. ఆ గదిలో డైరెక్టర్ తేజ గారి ఫోటో ఉంటుందంట. రోజు ఆ గదిని క్లీన్ చేస్తాడంట సుమన్ శెట్టి. ఇది దర్శకుడు తేజ చెప్తూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. ఇదిలా ఉండగా నెటిజన్లు ఫుల్ కామెంట్లు చేస్తున్నారు. సుమన్ శెట్టి వంటి నేచురల్ ఆర్టిస్ట్ ని మనం చాలా మిస్ అయ్యాం.. అందుకే అతడికి మన సపోర్ట్ ఇద్దాం.. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu) లో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి అని ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ వస్తున్నాయి. మరి హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు కామెంట్ చేయండి.
![]() |
![]() |